ఆస్పత్రి బెడ్‌పై టాలీవుడ్‌ హీరోయిన్‌.. పాపం ఏమయ్యుంటుంది?

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘జ్ఞాపకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది విశాఖ సింగ్‌. ఆ తర్వాత నారా రోహిత్‌తో ‘రౌడీ ఫెలో’ సినిమాలో కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాపులుగా మిగలడంతో టాలీవుడ్‌లో విశాఖ సింగ్‌కు అవకాశాలు కరువయ్యాయి. దాంతో మకాం చెన్నైకి ఫిఫ్ట్‌ చేసింది.

అక్కడ మంచి మంచి సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తిరుగులేని ఫాలోయింగ్‌ ఏర్పరచుకుంది. అయితే కొద్దిరోజులుగా తమిళ సినిమాల్లోనూ విశాఖ కనిపించడం లేదు. పూర్తిగా లైమ్‌లైట్‌లోకి వెళ్లిపోయింది. ఇక విశాఖను ప్రేక్షకులు మరిచిపోతున్నారనే టైమ్‌లో తాజాగా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.తాజాగా హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫోటోను విశాఖ సింగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి తన ఫాలోవర్స్‌ను షాక్‌కు గురిచేసింది.

ఏ సమస్య వల్ల ఆస్పత్రిలో ఉందో చెప్పలేదు కానీ, తాను అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్నట్లు వెల్లడించింది. కొన్ని భయంకరమైన ఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో ఆనారోగ్యం సమస్యలు తనను వేధించాయని వెల్లడించింది. అయితే తనకు ఎంతో నచ్చే సమ్మర్‌ సీజన్‌ రావడం చాలా సంతోషంగా ఉందని విశాఖ పేర్కొంది.

ఏప్రిల్‌ వచ్చిందంటే తనకు కొత్త సంవత్సరం స్టార్ట్‌ అయినట్లు అనిపిస్తుందని, ఇదే నెలలో తాను పుట్టడం వలన కూడా ఆ ఫీలింగ్‌ కలగొచ్చని తెలిపింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నానని విశాఖ సింగ్‌ ఎమోషనల్‌ నోట్‌ను ఫోటోకు జత చేసింది. ఈ పోస్ట్‌ చూసిన పలువురు నెటిజన్‌లు విశాఖ సింగ్‌ త్వరగా కోలుకోవాలని కామెంట్స్‌ చేస్తున్నారు.

Leave a Reply