Viral Video | పుచ్చకాయ జ్యూస్ తో.. చికెన్ బిర్యానీ.. ఇంకా దేవుడే కాపాడాలి..

Viral Video | బిర్యానీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, మష్రూమ్‌, థమ్‌, వెజిటముల్‌, పన్నీర్‌.. అబ్బో ఒకటేమిటి ఎన్ని రకాలుగా తయారు చేసినా అన్ని రకాల బిర్యానీలను రుచి చూడకుండా ఉండలేరు భోజన ప్రియులు.మీరింత వరకూ రెస్టారెంట్‌ రుచుల నుంచి రోడ్డు పక్కన గల్లీ షాపుల వరకు ఎన్నో రకాల బిర్యానీలు లొట్టలేసుకుంటూ లాగించేసి ఉంటారు. నోట్లో వేసుకోగానే ఇట్టే గుటుక్కున జారిపోయే కమ్మని బిర్యానీ వాసన చూసినా చాలు కడుపు నిండి పోతుంది.

కానీ ఈ ఆంటీ చేసిన బిర్యానీ మాత్రం ‘మేము తినలేం బాబోబ్‌..’ అంటున్నారు నెటిజన్లు. తినేందుకేకాదు కనీసం చూసేందుకు కూడా ఎవ్వరూ సాహసించడం లేదు. అదేంటీ అని అనుకుంటున్నారా? మరి ఇది అల్లాటప్ప బిర్యాని కాదుమరీ.. పుచ్చకాయ బిర్యానీ’. ఇలాంటి బిర్యానీ మేమెప్పుడూ తినలేదే.. కనీసం పేరు కూడా ఎప్పుడూ వినలేదే అని నోరెళ్ల బెడుతున్నారా? .

ఈ వీడియో చూశారంటే మీ ఫ్యూజులు కచ్చితంగా ఎగిరిపోతాయ్‌..ముందుగా చాలా పుచ్చకాయలను కట్ చేసి, దాన్నుంచి జ్యూస్ బయటకు తీసి పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఓ పెద్ద పాత్రలో చికెన్ ముక్కలను కడిగి పక్కన పెట్టకుంటారు.ఆ తర్వాత నూనెలో మసాలాలు వేయించి, అందులో చికెన్ ముక్కలను వేస్తారు. అవి ఉడుకుతుండగానే అందులో పక్కన సిద్ధంగా ఉంచుకున్న బాస్మతి రైస్‌తో పాటూ పుచ్చకాయ జ్యూస్‌ను కూడా కలుపుతారు.

 ‘నా వాళ్లే నన్ను మోసం చేశారు’… కన్నీరు పెట్టిస్తున్న సునీత మాటలు

ఇలా చివరకు ఘుమఘుమలాడే పుచ్చకాయ చికెన్ బిర్యానీని సిద్ధం చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”ఆహా..!! వాట్ ఏ కాంబినేషన్”.. అంటూ కొందరు, ”పుచ్చకాయలను కలపడం కంటే.. విడిగా తింటేనే బాగుంటాయి”.. అంటూ మరికొందరు, ”దయచేసి బిర్యానీని ఇలా పాడు చేయకండి”.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Recent Posts

Leave a Reply