YS Sowbhagyamma | అవినాష్ పై వివేకానంద రెడ్డి భార్య ఎంపీగా పోటీ..? ఇంకా ఓటమి కాయం.

allroudadda.

YS Sowbhagyamma | కడప అంటేనే రెడ్ల అడ్డ. దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ ఫ్యామిలీ హవా కొనసాగుతోంది. 1989 నుంచి ఇప్పటి వరకు కూడా కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్సార్ కుటుంబీకులే ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. అయితే త్వరలో ఎన్నికలు జరగనుండడంతో.. కడప లోక్ సభ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకుంటే ఈసారి ఇద్దరు వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన వారే ప్రత్యర్థులుగా పోటీ పడుబోతున్నారు.

ఈక్రమంలో కడప రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి.కారణం2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ చిన్నాన్న కుమారుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది.అయితే వైఎస్‌ వివేకా హత్య తదనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఇది చాలదన్నట్టు వైఎస్‌ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక ఈ పరిణామాలు వేడెక్కాయి.

allroudadda.
allroudadda.

ఈ నేపథ్యంలో నూతనంగా కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల.. కడప ఎంపీ స్థానం నుంచి తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించే యోచనలో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. వాస్తవానికి షర్మిల పోటీ చేయాలని అనుకున్నా తనకంటే కూడా తన చిన్నమ్మే.. వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపై మంచి అభ్యర్థి అవుతారని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పాపం జగన్ సభ కోసం బస్సు డ్రైవర్‌గా మారిన పేర్ని నాని..!

వాస్తవానికి కడప ఎంపీ స్థానం నుంచి వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత పోటీ చేయొచ్చని వార్తలు వచ్చాయి. ఈ మేరకు సునీత కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరొచ్చని టాక్‌ నడిచింది. అయితే ఇటీవల షర్మిల ఇడుపులపాయ పర్యటనలో ఆమెను కలిసిన సునీత కాంగ్రెస్‌ లో చేరికకు ఆసక్తి చూపలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కడప లోక్‌ సభా స్థానంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పైన తన చిన్నమ్మను పోటీ చేయించే యోచనలో షర్మిల ఉన్నారని టాక్‌ నడుస్తోంది.చూడాలి మరి ఏం జరుగుతుందో,

Leave a Reply