యాక్టర్ శోభన్ బాబు చనిపోయాక ఆయన కొడుకు ఎక్కడ ఉన్నారు? ఏమైపోయాడో తెలుసా..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో శోభన్ బాబు. ప్రేమ కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అందాల నటుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అప్పట్లో ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. 70 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు. అయితే స్టార్ హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అందాల నటుడి కుమారుడు కూడా అచ్చం హీరోగానే ఉన్నాడు.

కానీ చిత్ర పరిశ్రమలోకి మాత్రం అడుగుపెట్టలేదు.ఇందుకు ప్రధాన కారణం ఉందట. తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఎంతోమంది శోభన్ బాబును అడిగారట. అందుకు ఆయన మాత్రం ఒప్పుకోలేదట. అప్పట్లో నటుడు రాజా రవీంద్ర శోభన్ బాబును ఇదే ప్రశ్న అడిగారట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. రాజా రవీంద్ర ఆయన అడిగిన ప్రశ్నకు శోభన్ బాబు మాట్లాడుతూ తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎంతగానో కష్టపడ్డారని,

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, సక్సెస్ అయినప్పటికీ కూడా చాలా ఒత్తిడికి గురయ్యేవాడినని అన్నారట.నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. ప్రతి సినిమాకు ముందు ఎంత సూపర్ స్టార్ అయిన టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్ నా కొడుకుకు వద్దు. నా పిల్లలు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటాను. మానసికంగా ఇబ్బంది పడే జీవితం నా పిల్లలకు వద్దు. అందుకే సినిమాలకు దూరంగా ఉంచాలని అన్నారట. పిల్లలు, ఫ్యామిలీ విషయంలో శోభన్ బాబు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పిల్లలు వ్యాపార రంగంలో స్థిరపడినట్లు సమాచారం.

Leave a Reply