Baby: బాక్సాఫీస్ కి చుక్కలు చూపించిన బేబి కలెక్షన్స్‌..! తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..

ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాలేదు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బేబి (Baby)’. తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్.

సాయి రాజేష్ డైరెక్టర్. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంటుంది. తొలి రోజే రికార్డు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. దీంతో బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బేబీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ వివరాలు
► నైజాం -రూ. 2.3 కోట్లు

►సీడెడ్‌- రూ.54.7 లక్షలు

►ఈస్ట్‌: రూ.40.5 లక్షలు

►వెస్ట్‌: 21.6 లక్షలు

►వైజాగ్‌: రూ.80.08లక్షలు

►కృష్ణా: రూ.34.6లక్షలు

►గుంటూరు: రూ.29.3లక్షలు

►నెల్లూరు: రూ.17.83లక్షలు

►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు

►ఓవర్సీస్‌: 1.74 కోట్లు

►మొత్తం : 7.1 కోట్లు

Leave a Reply