జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్..! బూతులు తిడుతున్న ఫాన్స్… ఏం జరిగింది అంటే.

YadammaRaju | టాలీవుడ్ కమెడియన్ యాదమ్మ రాజు.. ‘పటాస్’ కామెడీ షోతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత కూడా పలు టీవీ షోల్లో నటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపుని పొంది సినిమా అవకాశాలను సైతం అందుకున్నాడు. ఇక గత ఏడాది తాను ప్రేమించిన అమ్మాయి ‘షార్లీ స్టెల్లా’నే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక షో ద్వారా తెలియజేశాడు. 2022 నవంబర్ లో నిశ్చితార్ధం చేసుకున్న వీరిద్దరూ.. డిసెంబర్ లో ఏడడుగులు వేశారు.

Yadamma Raju
Yadamma Raju

ఈ పెళ్ళికి నాగబాబు, అశ్విన్‌ బాబు, ఆకాష్‌ పూరీ, యాంకర్‌ ప్రదీప్‌ వంటి స్టార్స్ కూడా హాజరయ్యి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో కూడా కనిపించారు. అయితే కొన్ని రోజులు నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి.అదంతా పక్కన పెడితే తాజాగా YadammaRaju యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది.

Yadamma Raju
Yadamma Raju

ఈ విషయాన్నీ అతని భార్య స్టెల్లా సోషల్ మీడియాద్వారా తెలిపింది. యాదమ్మ రాజుకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. కాలు విరిగింది.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. హాస్పిటల్ లో యాదమ్మరాజు చికిత్స పొందుతున్నాడు. కాలు విరిగినట్లు తెలుస్తోంది.

Yadamma Raju
Yadamma Raju

ఇక ఈ వీడియో చూసిన అభిమానులు యాదమ్మ రాజు త్వరగా కోలుకోవాలని కోరుతుండగా .. మరికొందరు స్టెల్లా చేసిన పనికి బూతులు తిడుతున్నారు. మొదటి నుంచి కూడా స్టెల్లా, YadammaRaju యాదమ్మ రాజు రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన విషయం తెల్సిందే. అయితే భర్త హాస్పిటల్ లో ఉన్నా కూడా ఆమె రీల్స్ చేయడం.. దాన్ని కూడా లైక్స్ కోసం వాడుకోవడంతో కొంతమంది అభిమానులు ఆమెను బూతులు తిడుతున్నారు.

Leave a Reply