Nuvve Nuvve | ఈ ఫోటో లో కనిపిస్తున్న స్టార్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టరా.

allroudadda

Nuvve Nuvve | త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను (Trivikram Srinivas) దర్శకునిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’ (Nuvve Nuvve). ఈ సినిమాలో తరుణ్ (Tharun), శ్రియ (Shriya) జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోమవారానికి ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు అయింది. కాలంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు మన మనసులను తాకుతాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

allroudadda
allroudadda

అటువంటి సినిమాల్లో ‘నువ్వే నువ్వే’ ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇరవై ఏళ్ళైనా, ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు సోఫాలో కూర్చుని మరీ చూస్తారు. మళ్ళీ మళ్ళీ సినిమాలోని డైలాగులను యూట్యూబ్‌లో వీడియో పెట్టుకుని మరీ వింటారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలకు వినోదం మేళవించి రూపొందించిన సినిమా ‘నువ్వే నువ్వే’.

allroudadda
allroudadda

కూతురిపై తండ్రి ప్రేమను మాత్రమే కాదు, బాధ్యతను హృద్యంగా చూపించారు. వెండితెరపై ఓ కథను కాకుండా జీవితాన్ని చూసిన భావన కలగడం వల్ల ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలతో టాప్ రైటర్‌గా ఎదిగిన త్రివిక్రమ్‌ను ‘నువ్వే నువ్వే’తో ‘స్రవంతి’ రవికిశోర్ దర్శకునిగా పరిచయం చేశారు. ఈ చిత్రంతో దర్శకునిగా త్రివిక్రమ్ తన ప్రతిభ చాటారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో తీసిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Taapsee | పెళ్లిపై స్టార్ హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు..

తరుణ్, సునీల్, ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్ ను ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక ఆ సీన్ ను త్రివిక్రమ్, వారికి వివరిస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది. ఇందులో త్రివిక్రమ్.. కళ్ళజోడు పెట్టుకొని.. ఫుల్ హెయిర్ తో టైడ్ అయినవాడిలా కనిపిస్తున్నాడు. మొదటి సినిమాకు డైరెక్టర్ ఆ మాత్రం టైడ్ నెస్ ఉండాలి. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. అప్పుడున్న గురూజీని గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడున్న గురూజీ వేరు.. ఆయన స్థానం వేరు.. స్థాయి వేరు అని చెప్పుకొస్తున్నారు. మరి వింటేజ్ త్రివిక్రమ్ మళ్లీ వస్తాడేమో చూడాలి.

Leave a Reply