Ayodhya Surya Tilak | శ్రీరామనవమి శుభవేళ అయోధ్యలో బలరాముడి నిజ దర్శనం..

Ayodhya Surya Tilak

Ayodhya Surya Tilak | అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవే. అందుకే ఈ వేడుకలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా (Surya Tilak) ప్రసరించాయి.

మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలక్‌ రాముడి నుదుటిని తాకాయి. కొన్ని నిమిషాల పాటు ఈ తిలకం కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాలను దేశ ప్రజలు టీవీ లైవ్ ద్వారా వీక్షించారు.ఇక ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ఈ అపురూప దృశ్యాలను తన ట్యాబ్‌లో లైవ్‌ ద్వారా వీక్షించారు.Ayodhya Surya Tilak

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ఈ అద్భుత క్షణాన్ని చూసే అవకాశం తనకి లభించిందన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీరామ జన్మభూమి ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచే క్షణంగా అభివర్ణించారు.అంతకు ముందు దేశ ప్రజలకు ప్రధాని రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి కృప వల్లే ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చూడగలిగానని చెప్పుకొచ్చారు.

Recent Posts

Leave a Reply