Barrelakka Wedding | పెళ్లి పీటలు ఎక్కనున్న బర్రెలక్క..

allroudadda

Barrelakka Wedding | హాయ్ ప్రెండ్స్.. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదని, బర్రెలు కాయాల్సి వస్తోంది’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో చేసిన ఒక్కపోస్టుతో శిరీష ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ పోస్టుతోనే శిరీష కాస్తా బర్రెలక్క అయ్యింది. అలా పాపులర్ అయిన బర్రెలక్క.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కొల్లాపూర్ నుంచి బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు ఎంతో మంది సపోర్ట్ చేశారు.

మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, యువతీ యువకులు ఎంతో మంది సపోర్ట్ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో బర్రెలక్కకు పెద్దగా ఓట్లు పడలేదు. అయినప్పటికీ అధైర్య పడకని బర్రెలక్క.. ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించింది.అయితే తాజాగా తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ఆమె ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు బర్రెలక్క తాజాగా తెలిపింది.

allroudadda
allroudadda

తన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం సడెన్‌గా సెట్‌ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని ఆమె చెప్పింది. పెళ్లి కోసం షాపింగ్ చేసిన వీడియోలను కూడా ఆమె పంచుకుంది. కాబోయే భర్త ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ అవాస్తవాలనీ ప్రశాంత్‌ తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని బర్రెలక్క కొట్టిపారేసింది.

Recent Posts

Leave a Reply