Siddharth – Aditi | అదితితో సిద్ధార్థ్‌ కలిసి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్‌

allroudadda

Siddharth – Aditi | టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది అయితే ఇదివరకే వీరిద్దరూ వేరే వ్యక్తులను వివాహం చేసుకొని వారికి విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే వీరి గురించి ఎన్ని రకాల వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ వార్తలపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఇలా క్లారిటీ ఇవ్వకుండానే వీరిద్దరూ పెద్ద ఎత్తున కలిసి కెమెరా కంటికి కనబడుతున్నారు. విదేశాలకు వెకేషన్ వెళ్లిన, పార్టీలకు వెళ్లిన రెస్టారెంట్లకు వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.

ఈ చిన్న పని చేస్తే మీ ముఖం మెరిసిపోతుందన్న జాన్వీ!

త్వరలో మూడు ముళ్ల బంధం..

allroudadda
allroudadda

అయితే ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వడం లేదు అంటూ ఎంతోమంది వీరి రిలేషన్ పై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. సిద్ధార్థ్‌తో కలిసి అదితి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

రెండో పెళ్ళైన.. రెండు నెలలకె తల్లి కాబోతున్న అమ్మడు..

‘ఎనిమీ’ సినిమాలోని ‘టమ్‌ టమ్‌’ అనే పాటకు వీరిద్ధరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను అదితి స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో పలువురు నెటీజన్లు ‘త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టండి’. ‘లేటెందుకు మీ జోడీ చాలా బాగుంది..పెళ్లి చేసుకోండి’. ‘ఎప్పుడు మీ పెళ్లి శుభవార్త చెబుతారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Leave a Reply