Game Changer | పాపం మళ్ళీ దొరికిపోయిన థమన్.. జరగండి సాంగ్ ఆ సాంగ్ కు కాపీ అంటూ ట్రోల్స్.

allroudadda

Game Changer | రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా నుంచి గత రామ్ చరణ్ బర్త్ డే నాడు టైటిల్ అనౌన్స్‌మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ తరువాత మళ్ళీ మరో అప్డేట్ లేదు. మళ్ళీ ఏడాది తరువాత రామ్ చరణ్ పుట్టినరోజున నాడే మరో అప్డేట్ ని తీసుకు వచ్చారు.

‘జరగండి…’ అనే లిరికల్ వీడియో విడుదల చేశారు. కలర్ఫుల్ సెట్ లో కోట్లు ఖర్చు చేసి భారీగా ఈ సాంగ్ తెరకెక్కించారు. శంకర్ మార్క్ సాంగ్ నిర్మాణ విలువలు కనిపించాయి. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, ప్రభుదేవా కొరియోగ్రఫీ సమకూర్చారు. థమన్ మ్యూజిక్ మాత్రం శంకర్ స్థాయిని అందుకోలేదు. ఏదో నాలుగైదు పాటల ట్యూన్స్ మిక్స్ చేసి ఆడియన్స్ మొహాన వేశాడు.

allroudadda
allroudadda

శంకర్ మూవీకి ఒకప్పుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ నభూతో నభవిష్యతి. శంకర్ మేకింగ్ ని రెహమాన్ ట్యూన్స్ మరింత ఎలివేట్ చేసేవి. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం ఆవిష్కృతం అయ్యేది. శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్ వండర్స్ లా ఉంటాయి. థమన్ ట్యూన్స్ తో శంకర్ తన మ్యాజిక్ కోల్పోయాడు. మరో దారుణమైన విషయం ఏమిటంటే… ఇది కూడా కాపీ సాంగ్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్ షురూ చేశారు.

జరగండి.. సాంగ్ ప్రారంభం శక్తి సినిమాలోని ఓ సాంగ్ ని గుర్తు చేసింది. ఆ ట్యూన్ కి దగ్గరగా ఉంది. ఎన్టీఆర్-ఇలియానా నటించిన శక్తి చిత్రంలో ‘సుర్రా సర్రన్నాదే’ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ ని మణిశర్మ ట్యూన్ చేశారు. జరగండి సాంగ్ ఈ సుర్రా సర్రన్నాదే సాంగ్ ని గుర్తు చేస్తుంది. ఎక్కడో విన్నట్టుందని సెర్చ్ చేసిన నెటిజెన్స్… జరగండి శక్తి సినిమాలో సాంగ్ కి కాపీ అంటూ థమన్ ని ఏకిపారేస్తున్నారు.

Leave a Reply