Heroine sneha | మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిన స్నేహ భర్త..

Heroine sneha | తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు స్నేహ. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దొచుకుంది. దివంగత హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రియుల మదిని దొచుకుంది స్నేహ. రాధ గోపాలం.. శ్రీరామదాసు.. వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో ప్రసన్న కుమార్ ను 2011లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ.. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించింది.

heroine-sneha
heroine-sneha

అయితే కొద్ది రోజులుగా స్నేహ తన భర్తతో విడిపోయిందని.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పొజెసివ్‌నెస్‌ ఉండాలి.. కానీ అతిగా ఉండకూదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్‌ చేయలేం. ఉదాహరణకు.. బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు.

అప్పుడే భర్తను వదిలేయడానికి సిద్దం అయిన అనసూయ..

మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు రావు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి.గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వారికి బ్రేకప్‌ అయింది. దానివల్ల నాకెలాంటి సమస్యా లేదు. ఎందుకంటే ఆ బ్రేకప్‌ జరిగి ఉండకపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికేవాడే కాదు! అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చిపడటంతో ఆ ఏడాదంతా ఎంతో కష్టంగా నడిచింది. మానసిక ఒత్తిడికి లోనయ్యాను. సరిగ్గా అప్పుడే నేను ఉత్తమ నటిగా తమిళనాడు ఫిలిం అవార్డు అందుకున్నాను అని చెప్పుకొచ్చింది.

Recent Posts

Leave a Reply