Naa Anveshana | హీరోల కంటే ఎక్కువ సంపాదన.. నిజంగా మహారాజే..

allroudadda

Naa Anveshana | సోషల్ మీడియా ద్వారా పాపులరైన వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. వైజాగ్ కు చెందిన ఓ యూట్యూబర్ గా మారి ప్రపంచాన్ని ఇట్టే చుట్టేసి వస్తున్నాడు. యూట్యూబ్ నుంచి కళ్లు చెదిరే ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? అతడి కథేంటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. భీమిలికి చెందిన యువకుడే ఈ అన్వేష్. ట్రావెలింగ్ అండ్ టూరిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో ‘నా అన్వేషణ’ అనే ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించాడు.

అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడటమే కాదు, తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా. ప్రస్తుతం అతడి యూట్యూబ్ చానెల్ కు 1.39 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అన్వేష్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు.

allroudadda
allroudadda

అన్వేష్ బాగా పాపులర్ కావడంలో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలకపాత్ర పోషించింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్నారు. వీడియో నెట్టింట్లో బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. అప్పటి నుంచి ప్రపంచ యాత్రను మరింత స్పీడప్ చేశాడు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగు పెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా , అమెరికా, యూరోప్‌ దేశాలు తిరిగి వచ్చాడు.

allroudadda
allroudadda

అయితే ఈయన యూట్యూబ్ ద్వారా సంపాదించే నెల సంపాదన మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సంపాదించరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన పెట్టే వీడియోస్ నుండి దాదాపుగా నెలకి కోటి 50 లక్షల రూపాయలకు పైగానే డబ్బులు వస్తాయట. ఈ విషయాన్నీ అన్వేష్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు. ఒక స్టార్ హీరో ఒక సినిమాని పూర్తి చెయ్యడానికి ప్రస్తుతం ఏడాది నుండి రెండేళ్ల సమయం పడుతుంది.

Topi Amma | అసలు ఎవరీ టోపీ అమ్మ ? అసలు నిజాలు తెలుసుకోండి..

ఇందుకోసం వారు తీసుకొనే పారితోషికం 25 కోట్ల రూపాయిల నుండి ప్రారంభం అవుతుంది. కానీ అన్వేష్ కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదిస్తున్నాడు. ఒక్కో నెల ఆయనకీ మూడు కోట్ల రూపాయిలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. అలా ఏడాదికి సగటున అన్వేష్ 20 కోట్ల రూపాయిల వరకు సంపాదిస్తాడని అంటున్నారు. ఇతను పెట్టే వీడియోస్ కి, పడే కష్టానికి ఆ మాత్రం రావడం తప్పే లేదు అని చెప్పొచ్చు.

Leave a Reply