Aditi Rao – Siddharth | సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకొన్న హీరో సిద్దార్థ్, అదితి..?

allroudadda

Aditi Rao – Siddharth | సిద్ధార్థ్, అదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పలు సందర్భంగా వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. ‘మహా సముద్రం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శర్వానంద్ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లారు.అయితే నిన్నటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.లంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీరంగనాయకస్వామి ఆలయంలో ఈ ఉదయం వీరి వివాహం జరిగింది.

అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహం రహస్యంగా జరిగింది. మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా గుడిలోకి రానివ్వలేదు. కేవలం పురోహితులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి పెళ్లి కార్యాన్ని నిర్వహించారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితీరావు హైదరీ ఒకరు. తాజాగా అదితిరావు హైదరి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అదితి, సిద్దార్థ్ లు తీసుకున్న సెల్ఫీ ఫోటోని అదితి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

allroudadda.
allroudadda.

ఈ ఫొటోలో ఇద్దరూ కొత్త ఉంగరాలతో ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ అదితి.. అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్ అని పోస్ట్ చేసింది.దీంతో ఈ జంట నిన్న కేవలం నిశ్చితార్థం చేసుకున్నారని, పెళ్లి కాదని క్లారిటీ వచ్చింది. మొత్తానికి దాదాపు మూడేళ్ళుగా సాగుతున్న ప్రేమని నేడు అధికారికంగా చెప్పేసింది అదితి. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఫోటో వైరల్ అవ్వగా అభిమానులు, పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Recent Posts

Leave a Reply