Madhavi Latha | పెళ్లి చేసుకోవడం కంటే ఇది చాలా మేలు.. ఎందుకంటే..?

allroudadda

Madhavi Latha | టాలీవుడ్‌లో న‌చ్చావులే చిత్రంతో స‌క్సెస్ కొట్టిన హీరోయిన్ మాధ‌వీ ల‌త, స్నేహితుడా, అర‌వింద్ 2 వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ఆ త‌ర్వాత ఆమె క్ర‌మంగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాజ‌కీయాల‌కు కూడా దూరంగానే ఉంటుంది. మ‌న‌సంతా కృష్ణ త‌త్వాన్ని వ్యాప్తి చేయ‌టంపైనే మ‌న‌సు ల‌గ్నం చేశాన‌ని ఆమె అంటున్నారు మ‌రి. ఇదే స‌మ‌యంలో ఆమెను ఓ ప్ర‌శ్న ప‌దే ప‌దే ఇబ్బంది పెట్టింది.. ఇంత‌కీ ఆ ప్ర‌శ్నేంటో తెలుసా!.. పెళ్లెప్పుడు?. సాధార‌ణంగా ఓ ఈడొచ్చిన పిల్ల‌కు పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు అనుకుంటారు.

అది ఒక‌ప్పుడు. కానీ ఇప్పుడీ స్పీడ్ యుగంలో కెరీర్‌లో సెటిలైన త‌ర్వాత‌నో.. బాగా డ‌బ్బులు సంపాదించిన త‌ర్వాత‌నో .. అదీ ఇదనే కార‌ణాల‌తో పెళ్లి అనేది యువ‌త తొంద‌ర‌ప‌డ‌టం లేదు.అయితే అమ్మాయిల విష‌యంలో మాత్రం పెళ్లి ప్ర‌స్తావ‌న విష‌యం కామ‌న్ పాయింట్ అయ్యింది. ఇప్పుడ‌లాంటి ప్ర‌శ్నే మాధ‌వీల‌త‌ను ఇబ్బంది పెట్టింది. ప‌దే ప‌దే అడుగుతున్నారో.. ఇబ్బంది పెడుతున్నారో తెలియ‌దు కానీ, అమ్మ‌డు మాత్రం తెగ ఇరిటేట్ అయ్యింది.

allroudadda
allroudadda

దీంతో త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆ ప్రశ్న‌ను అడిగిన వారంద‌రికీ స‌మాధానం ఇచ్చింది.అసలు పెళ్లి అనేది వద్దు సహజీవనం చాలా బెటర్.. అయితే సమాజంలో పెళ్లి చేసుకుని సంవత్సరం తర్వాత విడాకులు తీసుకునే దాని కంటే సహజీవనం బెటర్ కదా అని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరి అంగీకారం అవసరం లేదు. ఎవరికీ సాక్ష్యాలు కూడా చూపించాల్సిన అవసరం లేదు.

Topi Amma | అసలు ఎవరీ టోపీ అమ్మ ? అసలు నిజాలు తెలుసుకోండి..

ఎవరి ఆస్తుల మీద ఎవరు అధికారం చెలాయించాల్సిన అవసరం కూడా ఉండదని ఆమె వివరించారు. హ్యాపీగా కలిసి ఉన్నన్ని రోజులు ఉంటారు. విడిపోయేటప్పుడు అండర్ స్టాండింగ్ తో విడిపోతారు.ఇకపోతే ఇలా కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు. సెకండ్ హ్యాండ్ అనే బ్రాండ్ అక్కర్లేదు. తను డివోర్స్.. ఇది రెండో పెళ్లి అంట, మూడో పెళ్ళంట ఇలాంటివన్నీ ఏవీ అవసరం లేదని ఆమె చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదని మాధవీలత స్పష్టం చేశారు.

allroudadda
allroudadda

సుప్రీంకోర్టు కూడా అందుకే దాన్ని లీగల్ చేసిందని, భారతదేశంలో ఎంత మంది భారతీయుల్ని ఆపగలుగుతున్నాం అని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ కలిసుంటే ఉంచుకున్నారని అంటారని, ఉంచుకోవడానికి ఏమైనా వస్తున్నావా… మనుషులు అని ఆమె చెప్పారు. మనుషులు ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఉంచుకోవడం అనే మాట ఎందుకని ఆమె అన్నారు. ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్లకు కలిసి ఉండాలి అనిపిస్తుంది అని, అందుకే వాళ్ళు కలిసి ఉంటారని మాధవీలత చెప్పారు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహజీవనమే బెటరని తాను నమ్ముతున్నట్టు వివరించారు.

Recent Posts

Leave a Reply